ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన వర్ల రామయ్య

  • ఎన్నికలెప్పుడు జరగాలన్నది ఈసీ నిర్ణయిస్తుంది
  • కానీ, ఆ విషయాలను నాయకులు చెబుతున్నారు!
  • వాళ్లు అలా చెబుతుంటే ఈసీ ఏం చేస్తోంది?
ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసోడియాను టీడీపీ నేత వర్ల రామయ్య ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ రద్దు చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరగాలన్నది ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయిస్తుందని అన్నారు. కానీ, ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే తేదీలను నాయకులు చెబుతుంటే ఈసీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలపై కేంద్ర ప్రభుత్వం పట్టు కోల్పోయిందని విమర్శించారు. రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఒప్పుకునేది లేదని, రాష్ట్రాలను సాధించాలని చూస్తే, మోదీ సర్కార్ కు పతనం తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు.
Go Back to Shorts
varla ramaiah
sisodia

More Telugu News